
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అప్పుడే?
AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఉ.9 నుంచి 12 గంటల వరకు, మ.2.30 నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీలోపు ఫీజు చెల్లించారు. ఈ నెల 13 నుంచి 22వ తేదీలోపు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకునే వారు దరఖాస్తు చేసుకోగలరు.