వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్, లేని వాహనదారులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలను వాహనదారులకు సూచించారు.