మెదక్ జిల్లా ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, వైద్య, వివిధ శాఖల అధికారులతో ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలోని సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటరు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.