సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని పాత్రికేయులు నిరసన తెలుపుతూ అదనపు కలెక్టర్ నగేష్ కి వినతి పత్రం ఇచ్చారు. పత్రిక స్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు లాంటిదని పలువురు విమర్శించారు. ఈ దాడిని మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని కోరారు. వివిధ పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.