తపస్ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంపాదిత సెలవుల ప్రొసీడింగ్స్ ఇవ్వవలసిందిగా మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సంపాదిత సెలవులు ప్రొసీడింగ్స్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, పాపన్నపేట మండల అధ్యక్షుడు నర్సిములు పాల్గొన్నారు.