మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామం పక్కనే ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ అనుమతులు లేకుండా విస్తరణ చేస్తున్నట్లు గ్రామస్థుల ఆరోపించారు. కంపెనీ విస్తరణను ఆపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. 200 టన్నుల సామర్థ్యం గల ప్లాంటు విస్తరణ నిలిపివేయాలని, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో గ్రామం ఆగమవుతుందని వివరించారు.