11 ఏళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తిని పోలీసులు కనిపెట్టారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు. పాపన్నపేటకు చెందిన తేజసాయి 2014లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తేజసాయి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బెంగుళూరులో గుర్తించి కనిపెట్టారు. సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశ్యంతో వెళ్లి వ్యాపారంలో అక్కడ స్థిరపడ్డాడని, యువత అతడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.