మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈనెల 27న నిర్వహించనున్న వరంగల్ ఎల్కతుర్తి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఆమె సూచించారు.