చిట్కులులో వర్షం బీభత్సం.. తడిసిన ధాన్యం

71చూసినవారు
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కులు గ్రామంలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. అయితే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే ఆరబోసిన పంట వర్షానికి తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్