ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మెదక్ సమీకృత కలెక్టరేట్ లో భూములు, అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహులా రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కమిషన్ సభ్యులు, జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.