మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీజేపీ నాయకులు గురువారం మేడ్చల్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సు డిపోకు వెళ్లిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ రఘునందన్ రావు రాసిన లేఖను డిపో మేనేజర్ కు అందజేశారు. త్వరలోనే బస్సు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు డిపో మేనేజర్.