మహిళల సమానత్వం కోసం వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా టిఎన్జిఓ భవనంలో ఘననంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని అన్నారు.