
గర్భిణి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
AP: ఏలూరు జిల్లాలో నిండు గర్భిణి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. పోలవరం ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి శిరీష మృతిపై మంత్రి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదించాలని మంత్రి పేర్కొన్నారు. కొత్తకుంకాలకు చెందిన శిరీష అనే గర్భిణి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.