మెదక్ పట్టణంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలతో పాటు, కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ప్రతి గ్రాడ్యుయేట్ ని కలవాలని ఎంపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు.