మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.