మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో నిరుపేద కుటుంబం నిరాశ్రయులుగా మారారు. గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ భర్త చనిపోగా ఒక కూతురుతో ఇంట్లో నివాసం ఉంటుంది. భారీ వర్షాలకు ఇల్లు కుప్పకూలడంతో ఇద్దరు నిరాశ్రయులయ్యారు. దాతలు ఎవరైనా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించాలని బుధవారం కోరారు.