మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజలకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకే హోలీ జరుపుకోవాలి. సంస్కృతి అద్దం పట్టేలా నిర్వహించాలి. బలవంతంగా రంగులు పూయడం, ఇతరులు, వాహనాలపై రంగు నీరు చల్లడం నిషేధం. మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు జైలు పాలు కావద్దు. తోటి మహిళలను గౌరవించాలి. శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.