నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు కోసం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ ఆనంద్ మాట్లాడుతూ.. నారాయణఖేల్ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలు ఉంటారన్నారు. వారికి అనుకూలంగా స్థానికంగా ఆర్టీవో కార్యాలయం లేకపోవడంతో జహీరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళవలసి వస్తుందన్నారు.