కంగ్టిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకు నిరసనగా కంగ్టి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం దాహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ కార్యకర్తలు, రైతులు ఉన్నారు.