రైతులు సొయా పంటను దళారుల దగ్గర అమ్మి మోసపోకండి
రైతులు సొయా పంటను దళారుల దగ్గర అమ్మి మోసపోకండని ఈ కేంద్ర ఇంచార్జ్ స్వప్న అన్నారు. కంగ్టి మండలంలోని రైతులు తమ సొయా పంటలను బి సి ఎం ఎస్ నాగల్ గిద్ద పరిధిలోని ఏఎంసీ మనూర్ గోదాంలోని కొనుగోలు కేంద్రంలో సొయా పంటలను గత వారం నుండి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా స్వప్న మాట్లాడుతూ. నాణ్యత ప్రమాణాలు పాటించి సొయా తేమ శాతం 10% నుండి 12% ఉండాలని రైతులను కోరారు. ప్రభుత్వం మద్దత్తు ధర 4892 కేటాయించిందని తెలిపారు.