కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. నర్సాపూర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతుందని, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు.