రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలి

79చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్, ఇమాంపూర్ గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తహశీల్దార్లు టేక్మాల్ శ్రీనివాస్, కృష్ణ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని ఆయా గ్రామ రైతులకు సూచించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్