మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మంత్రాలు, బాణామతి నమ్మవద్దని, కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.