అంబేడ్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

71చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నిరసన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుమేరకు నిరసన నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్