మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో శుక్రవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసీడింగ్ పత్రాలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.