
రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా పట్టుబడింది. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.