బీజేపీ ఢిల్లీలో భారీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తాలో టపాకాయలు కాల్చి ఆర్టీసి ప్రయాణికులకు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వానికి తిరుగులేదని అవినీతి రహిత పరిపాలన బీజేపీ వల్లనే సాధ్యం అవుతుందని అందువల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టతో పరిశుభ్రం చేశారన్నారు.