మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలం చిట్కుల్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వాహనదారులకు బ్రీతింగ్ టేస్ట్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.