నార్సింగి మండల వ్యాప్తంగా వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఏఈ స్వామి శనివారం సూచించారు. ప్రస్తుతం రైతులు జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారని గుర్తుచేస్తూ, వ్యవసాయ బావుల వద్ద మోటార్లు, స్టార్టర్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవచ్చని ఆయన సూచించారు.