మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం కోసమే విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. త్రాగునీరు, నాణ్యమైన భోజనం, హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించడం కోసమే తనిఖీలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.