మునిసిపాలిటీలో ఫ్రైడే డ్రై డే

53చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం మున్సిపాలిటీలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఆధ్వర్యంలో పట్టణంలో 13వ వార్డ్ 16వ వార్డులలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పరిసరాలను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.

సంబంధిత పోస్ట్