నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులను నర్సాపూర్ ఆస్పత్రిలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.