దొంతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎంపికైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భువనగారి శ్రీనివాస్, చుక్క శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ , స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.