మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి భిక్షమయ్య భార్య మల్లమ్మ తుజాల్పూర్ గ్రామంలోని రేషన్ షాపు వద్ద బియ్యం తీసుకువస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వేతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం వృద్ధురాలి కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు నర్సాపూర్ ఎస్సై లింగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.