తూప్రాన్ మండలంలో మూడు రోడ్లను విస్తరించేందుకు హైబ్రిడ్ ఆన్యూటి మోడల్ పథకం చేపడుతున్నారు. మూడు రోడ్లకు ప్రతిపాదనలు చేయగా లాస సంస్థ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. తూప్రాన్ నుంచి మల్కాపూర్ కు 12 KM, తూప్రాన్ నుంచి వెంకటాయపల్లి చౌరస్తా 8 KM, తూప్రాన్ నుంచి రత్నాపూర్ మీదుగా ఇస్లాంపూర్ కు 2. 61KM, రోడ్లను విస్తరించనున్నారు. ఆబోతుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరారు.