
గ్లోబల్ వార్మింగ్‌తో ఏటా 44 గంటల నిద్రను కోల్పోతున్న జనం
గ్లోబల్ వార్మింగ్‌తో భూమి వేడెక్కుతోంది. ఫలితంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రతికూల ప్రభావంతో సంవత్సరానికి సగటున 44 గంటల నిద్రను మనుషులు కోల్పోతున్నారని 'ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ స్లీప్ అసోసియేషన్' పేర్కొంది. దీని వల్ల మానవుల శారీరక, మానసిక ఒత్తిడులూ పెరుగుతున్నాయని చెప్పుకొచ్చింది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ వల్ల వాతావరణం వేడెక్కి ఉక్కపోతతో రాత్రుల్లో ప్రజలు కంటినిండా నిద్రపోవడం లేదని తెలిపింది.