జీవాలు మృతి చెందుతున్న పట్టించుకోని వెటర్నరీ అధికారులు

59చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంత్ రావు పేటలో వెటర్నరీ అధికారులు తమను పట్టించుకోవడం లేదని యాదవ సంఘం సభ్యులు గురువారం ఆరోపించారు. తమ జీవాలకు వ్యాధులు సంక్రమించినా పశువైద్యాధికారులు స్పందించడం లేదన్నారు. రోగాల పాడిన పడి జీవాలు మృతి చెందుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ప్రభుత్వం నుంచి మందులు సరఫరా కావడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్