మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో గురువారం మిషన్ పరివర్తన అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమ్యూనిటీ ఎడిటర్ లక్ష్మీప్రసన్న తెలియజేశారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే శరీరం మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాటిని పగడ్బందీగా అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.