నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు శనివారం పర్యటించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పెద్ద గొట్టిముక్కల గ్రామంలో జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామ ప్రజలని కలిసి, వారి సమస్యలను తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరారు.