వెల్దుర్తిలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు మెనూ అందిస్తామన్నారు. విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.