మెదక్ జిల్లా హనుమాన్ జయంతి సందర్భంగా నర్సాపూర్ హిందూ బంధువుల ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, నర్సాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఆవుల రాజి రెడ్డి, హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.