తెలంగాణ సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం-మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ సమగ్రశిక్షా ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కై నిరవధిక సమ్మె లో నర్సాపూర్ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.