మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమంతపూర్ గ్రామంలో శనివారం నర్సాపూర్ పురపాలక సంఘం చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా 1వ వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.