జాతీయ రహదారిపై పనిచేయని సిగ్నల్ లైట్లు

81చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ప్రధాన జాతీయ రహదారిపై సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో వాహనదారులు శనివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నాలుగు కూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన సిగ్నల్ లైట్లు గత కొంతకాలంగా పనిచేయడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతోమంది గాయాలపాలై ఆసుపత్రుల పాలవుతున్నారని అధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్