రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జైన వృద్ధుడి కాళ్ళు

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జైన వృద్ధుడి కాళ్ళు
నర్సాపూర్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని లారీ ఢీ కొట్టటంతో గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ వైవు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్