సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జిహెచ్ఎంసి డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలుపుతు అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం నర్సాపూర్ మండల పరిధిలో నర్సాపూర్ నాలుగు కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.