మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మంత్రులను ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు.