మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ సమీపంలో టాటా ఏస్ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాయపడిన గ్రామస్తులను నర్సాపూర్ తాలూకా ఇన్‌చార్జ్ ఆవుల రాజీ రెడ్డి గురువారం పరామర్శించారు. శివంపేటలోని శ్రీ సాయి నర్సింగ్ హోమ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెబుతూ, నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.