నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల మల్లేష్ హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు గాను ఆపరేషన్ నిమిత్తం రెండులక్షల రూపాయల ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో శనివారం భాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.