మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో చివరి రోజు అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠచేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు.